భారతదేశం, నవంబర్ 21 -- Rashmika Mandanna Osey Ramulamma: తెలుగు వెండితెరపై సీనియర్ నటి విజయశాంతి పేరు తలచుకోగానే అందరి మదిలో మెదిలే మొదటి పాట 'ఒసేయ్ రాములమ్మ'. 1997లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం, అందులో ఆమె పోషించిన టైటిల్ పాత్ర ఆమె కెరీర్‌లోనే ఎప్పటికీ గుర్తుండిపోయే మైలురాయిగా నిలిచాయి.

సరిగ్గా 29 ఏళ్ల తర్వాత దర్శకుడు రవీంద్ర పుల్లె తన తాజా చిత్రం 'మైసా' కోసం ఈ ఒసేయ్ రాములమ్మ పాటను రష్మిక మందన్నపై రీక్రియేట్ చేశారు. ఈ రీమిక్స్ కు అసలైన ప్రత్యేకత ఏంటంటే.. ఒరిజినల్ పాటకు సంగీతం అందించి ఆలపించిన వందేమాతరం శ్రీనివాస్ దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ ఈ కొత్త వెర్షన్‌కు ప్రాణం పోయడం. ఈ పాట విడుదలైనప్పటి నుంచి సినీ ప్రియుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.

ఒసేయ్ రాములమ్మ సాంగ్ ను రీమిక్స్ చేయడంపై రష్మిక మందన్న తన ఫీలింగ్స్ ను షే...