భారతదేశం, సెప్టెంబర్ 15 -- Rashmika Mandanna: భారతీయ సంగీత ప్రపంచంలో శిఖరాగ్రాన నిలిచిన ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో నటించే అరుదైన అవకాశం రష్మిక మందన్నను వరించింది. 'M.S. - ఎ లెగసీ ఆన్ స్క్రీన్' పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ఆమె సుబ్బులక్ష్మి పాత్రలో కనిపించనుంది. ఈ మేరకు ఇవాళ (సెప్టెంబర్ 15) అఫీషియల్ అప్డేట్ వచ్చింది.

చాలా కాలంగా ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ గురించి చర్చ జరుగుతోంది. ఈ మూవీలో సుబ్బలక్ష్మి పాత్రను సాయిపల్లవి లేదా రుక్మిణి వసంత్ పోషిస్తుందనే టాక్ కూడా వినిపించింది. కానీ చివరకు రష్మిక మందన్న ఆ రోల్ కు కన్ఫామ్ అయింది.

'జెర్సీ' వంటి ఎమోషనల్ హిట్ అందించిన గౌతమ్ తిన్ననూరి ఈ ఎంఎస్ సుబ్బలక్మి బయోపిక్ కు దర్శకత్వం వహించనున్నాడు. అతను లాస్ట్ ఇయర్ విజయ్ దేవరకొండతో 'కింగ్డమ్' తీసిన సంగతి తెలిసిందే. ఇక రాక్‌స్టార్ అనిరుధ్ రవ...