భారతదేశం, మార్చి 15 -- నేషనల్ క్రష్, టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్నా ఇటీవలే విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అయితే, విజయ్‌తో లవ్ రూమర్్స వినిపిస్తున్న సమయంలోనే ఆనంద్ దేవరకొండ, ప్రస్తుతం మరిదితో రష్మికకు మంచి అనుబంధం ఉండేది.

అది ఇప్పుడు మరోసారి స్పష్టమైంది. ఆనంద్ 34వ పుట్టినరోజును పురస్కరించుకుని రష్మిక మందన్నా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కొన్ని అరుదైన ఫోటోలు, వీడియోలను షేర్ చేశారు. మరిదిపై ఉన్న ప్రేమాభిమానాలను చాటుతూ రష్మిక మందన్నా రాసిన పోస్ట్ ఇప్పుడు నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.

ఆదివారం (మార్చి 15) ఆనంద్ పుట్టినరోజు సందర్భంగా రష్మిక మందన్నా ఒక క్యూట్ ఫోటోను పంచుకున్నారు. అందులో రష్మిక, ఆనంద్ ఇద్దరూ ఆరెంజ్ కలర్ టీ-షర్టులు ధరించి ఒకేలా కనిపిస్తున్నారు.

"ఆనందా.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు! నువ్వు షూటింగ...