భారతదేశం, ఆగస్టు 5 -- Ranveer Singh: బాలీవుడ్ ఎనర్జటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్ భారతీయ వినోద రంగంలో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశారు. ప్రఖ్యాత బ్రాండ్ వాల్యుయేషన్ సంస్థ 'క్రోల్' (Kroll) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, మోస్ట్ వాల్యూబుల్ సెలబ్రిటీల జాబితాలో క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టి రణ్‌వీర్ సెకండ్ ప్లేస్ కైవసం చేసుకున్నారు.

ఏకంగా 162.9 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.1539 కోట్లు) బ్రాండ్ వ్యాల్యూతో ఆయన ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచారు.

ఈ టాప్ 10 లిస్ట్‌లో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) 177.9 మిలియన్ డాలర్ల బ్రాండ్ వాల్యూతో అగ్రస్థానంలో నిలిచి తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకున్నారు. గతేడాది వరకు నంబర్ 1 పొజిషన్‌లో ఏకచక్రాధిపత్యం చెలాయించిన విరాట్ కోహ్లీ.. ఈసారి 158.4 మిలియన్ డాలర్ల వ...