భారతదేశం, జూన్ 12 -- Ranveer Singh: బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ చుట్టూ నడిచిన 'డాన్ 3' వివాదంపై ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి తనదైన శైలిలో గొంతు విప్పారు. రణ్‌వీర్‌ను పరిశ్రమలో ఒంటరిని చేసి, టార్గెట్ చేయడం వెనుక కొందరి స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయని ఆమె ఆరోపించారు.

గత నెలలో ఫర్హాన్ అక్తర్ 'డాన్ 3' ప్రాజెక్ట్ నుంచి రణ్‌వీర్ హఠాత్తుగా తప్పుకోవడంతో, ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) అతనిపై నాన్-కోఆపరేషన్ నోటీసులు జారీ చేసింది. ఆ టైమ్ లోనే రణ్‌వీర్‌కు మద్దతు తెలిపిన కంగనా.. ఇప్పుడు లేటెస్ట్ ఇంటర్వ్యూలో బాలీవుడ్ అసలు రంగు బయటపెట్టారు.

"బాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరికి పాకిస్థాన్ అంటే ఒక రకమైన సాఫ్ట్ కార్నర్ ఉంది. మన దేశంలో వచ్చే చాలా సినిమాలు పాకిస్థాన్‌ను వెనకేసుకొస్తుంటాయి" అని న్యూస్18 ఇంటర్వ్యూలో కంగనా పేర్కొన్నారు. ...