భారతదేశం, సెప్టెంబర్ 9 -- Ranabaali Teaser: రణబాలి మూవీ టీజర్ వచ్చేసింది. విజయ్ విశ్వరూపం చూపిస్తూ సాగిన ఈ టీజర్ గూస్‌బంప్స్ తెప్పించింది. బ్రిటిష్ పాలకుల అరాచకాలను ఎదిరిస్తూ రౌద్రంతో విరుచుకుపడే పోరాట యోధుడిగా విజయ్ దేవరకొండ రా అండ్ రస్టిక్ అవతారంలో కనిపించారు. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ 'రణబాలి' (Ranabaali) టీజర్ రిలీజ్ కాగా, సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

ఈ మూవీలో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' చిత్రాలు ఎంతటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

'కింగ్ డమ్' (Kingdom) సినిమా ఆశించిన స్థాయి ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఈసారి ఎలాగైనా సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని విజయ్ గ...