భారతదేశం, ఏప్రిల్ 3 -- ఇండియన్ సినిమా ఇండస్ట్రీ స్థాయిని గ్లోబల్ తెరపై చాటిచెప్పిన సినిమా 'బాహుబలి'. కథాంశం, యాక్షన్ ఘట్టాలు, విజువల్ వండర్‌గా రాజమౌళి తీర్చిదిద్దిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడమే కాకుండా.. ఒక చారిత్రాత్మక చిహ్నంగా నిలిచిపోయింది. అయితే ఈ వెండితెర అద్భుతం వెనుక నటీనటులు పడ్డ కష్టం సామాన్యమైనది కాదు. తాజాగా పింక్‌విల్లా ఇంటర్వ్యూలో పాల్గొన్న రానా దగ్గుబాటి.. 'బాహుబలి' మేకింగ్ సమయంలో తాను అనుభవించిన శారీరక, మానసిక శ్రమ గురించి మనసు విప్పి మాట్లాడారు.

బాహుబలి సినిమాలో ఏ సీన్ మీకు శారీరక లేదా మానసిక ఒత్తిడిని కలిగించింది? అన్న ప్రశ్నకు రానా బదులిస్తూ.. ఒక్క సీన్ అని చెప్పడం కష్టమని పేర్కొన్నాడు.

"మేము ఈ సినిమా కోసం దాదాపు ఆరేళ్లు పనిచేశాం. ఆ సమయంలో ప్రతి రోజూ సవాలుతో కూడుకున్నదే. అప్పట్లో మన దగ్గర ఇన్ని యుద్ధ ప్రా...