భారతదేశం, నవంబర్ 5 -- Ramayana Trolls: ఇండియన్ సినిమా హిస్టరీలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'రామాయణం పార్ట్ 1' ఎట్టకేలకు ఇవాళ థియేటర్లలో సందడి చేస్తోంది. సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్ పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన ప్రేక్షకులు, సినీ విమర్శకులు సినిమా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని కితాబిస్తున్నారు. గ్రాఫిక్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆర్ట్ వర్క్ అన్నీ కూడా హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నాయని అంటున్నారు.

ఒకవైపు రామాయణం సినిమా విజువల్స్ పై ప్రశంసల వర్షం కురుస్తుండగానే, మరోవైపు సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా మొదలయ్యాయి. ముఖ్యంగా జటాయువు పాత్ర డిజైన్ పై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

"పక్షికి చేతులు ఉండటం ఎప్పుడైనా చూశారా? దర్శకుడు తన ఇమాజినేషన్ కు మరీ ఇంత స్వ...