భారతదేశం, ఆగస్టు 8 -- Ramayana Release: బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో రణ్‌బీర్ కపూర్, కన్నడ రాకింగ్ స్టార్ యశ్, నాచురల్ బ్యూటీ సాయి పల్లవి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ విజువల్ వండర్ 'రామాయణం' రిలీజ్ ప్లానింగ్‌పై ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఒక పెద్ద బాంబు పేల్చారు. విదేశాల్లో నవంబర్ 6న రిలీజ్ అవుతున్న ఈ విజువల్ వండర్, ఇండియాలో మాత్రం రెండు రోజుల ఆలస్యంగా దీపావళి పండుగ నాడు ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇటీవల విడుదలైన 'రామాయణం' ఇంగ్లీష్ ట్రైలర్‌లో నవంబర్ 6న థియేటర్లలోకి వస్తున్నట్లు స్పష్టంగా ప్రదర్శించారు. దీంతో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర పెద్ద ఎత్తున కన్ఫ్యూజన్ మొదలైంది. ఈ రెండు విభిన్న రిలీజ్ తేదీలపై ప్రైమ్ ఫోకస్ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా తాజాగా స్పందిస్తూ పూర్తి క్లారిటీ ఇచ్చారు.

ఓవర్సీస్ మార్కెట్‌లో శుక్రవారం (నవంబర్ 6) రిలీజ...