భారతదేశం, నవంబర్ 10 -- Ramayana Producer: 'రామాయణం' మూవీ నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. సాధారణంగా రూ. 4,000 కోట్ల (రెండు భాగాలకు కలిపి) అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఒక ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయితే నిర్మాతల పరిస్థితి ఏంటనే ఆందోళన అందరిలోనూ ఉంటుంది. అయితే ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ అధినేత, నిర్మాత నమిత్ మల్హోత్రా మాత్రం బాక్సాఫీస్ లెక్కల పట్ల చాలా ప్రశాంతంగా ఉన్నారు.

ప్రసిద్ధ అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్ (CNN)కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ, ఈ భారీ పెట్టుబడిని ఎలా తిరిగి రాబట్టుకోవాలో స్పష్టమైన రోడ్‌మ్యాప్ తన వద్ద ఉందని వెల్లడించారు.

"ఎంత డబ్బు వచ్చింది? ఎంత రాలేదు? అనే ఒక సాధారణ వ్యాపారి ఆలోచనా విధానంతో నేను ఈ సినిమాను నిర్మించలేదు. థియేటర్లలో టికెట్...