భారతదేశం, నవంబర్ 7 -- Ramayana Collections: బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌బీర్ కపూర్, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'రామాయణం పార్ట్ 1'. నవంబర్ 5వ తేదీన భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మొదటి రోజు మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కానీ కలెక్షన్ల విషయంలో మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.

రామాయణం పార్ట్ 1 ఫస్ట్ డే కలెక్షన్లు చూస్తే.. ప్రభాస్ హీరోగా వచ్చిన 'ఆదిపురుష్' సినిమాదే పైచేయి అని చెప్పాలి. 'ఆదిపురుష్' తొలిరోజు రూ.128 కోట్లు రాబట్టగా.. 'రామాయణం' రూ.127.50 కోట్లతో సరిపెట్టుకుంది. రామాయణం సినిమా అత్యధిక థియేటర్లలో (భారతదేశంలో 23,316 షోలు) విడుదలైనప్పటికీ మొదటి రోజు ఆదిపురుష్ రికార్డును మాత్రం బ్రేక్ చేయలేకపోయింది.

ఇండియాలో మొదటిరోజు రూ.64.85 కోట్లు నెట్ కలెక్ట్ చేసిన రామా...