భారతదేశం, నవంబర్ 9 -- Ramayana Break Even: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన మూవీ 'రామాయణం పార్ట్-1' (Ramayana Part 1) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి ప్రభంజనం సృష్టిస్తోంది. దాదాపు రూ.2,000 కోట్ల భారీ నిర్మాణ వ్యయంతో రూపుదిద్దుకున్న ఈ విజువల్ వండర్ బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్రను లిఖిస్తోంది.

అయితే ట్రేడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో బ్రేక్ ఈవెన్ సాధించి నిర్మాతలు సేఫ్ జోన్‌లోకి వెళ్లాలంటే ఏకంగా రూ.5,000 కోట్లు (సుమారు 500 మిలియన్ డాలర్లు) వసూలు చేయాల్సి ఉంటుంది. హాలీవుడ్ అతిపెద్ద బ్లాక్‌బస్టర్ చిత్రాల స్థాయిలో ఉన్న ఈ టార్గెట్ ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత అసాధ్యమైన సవాలుగా నిలిచింది.

ఫిల్మ్ బిజినెస్ విశ్లేషకుల నియమాల ప్రకారం, ఒక సినిమా థియేట్రికల్ బ్రేక్ ఈవెన్ పాయింట్‌ను చేరు...