భారతదేశం, అక్టోబర్ 29 -- Ramayana Brahma AI: ఇండియన్ సినిమా చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ, ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన అంచనాలతో రాబోతున్న బిగ్గెస్ట్ పీరియాడిక్ విజువల్ వండర్ 'రామాయణ' (Ramayana). అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ఏఐ వాడకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

లాస్ ఏంజెల్స్‌లోని అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్‌లో నిర్వహించిన ఈ రామాయణ ఇంగ్లీష్ ప్రదర్శన (World Premiere)లోని కంటెంట్ చూసి హాలీవుడ్ దిగ్గజాలు సైతం అవాక్కయ్యారు. అయితే ఈ సినిమాలో పాత్రల ఇంగ్లీష్ డబ్బింగ్, లిప్ సింక్ (Lip-Sync) కోసం ఏఐ టెక్నాలజీని ఉపయోగించారనే వార్త నెట్టింట వైరల్ కావడంతో, దీనిపై మేకర్స్ స్పందించి అసలు సాంకేతిక రహస్యాన్ని వెల్లడించారు.

'రామాయణ' పార్ట్-1 చిత్రంలో అంతర్జాతీయ ప్రేక్షకులకు సహజమైన అనుభూతిని అందించడం కోసం 'బ్రహ్మ ...