భారతదేశం, నవంబర్ 12 -- Ramayana Box Office Collection: దీపావళి కానుకగా నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదలైన 'రామాయణం' మొదటి భాగం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. విడుదలైన వారం రోజుల్లోనే ఈ చిత్రం బాక్సాఫీస్ లెక్కలను తారుమారు చేస్తూ ఆల్-టైమ్ రికార్డులను తిరగరాస్తోంది.

ఎక్స్‌టెండెడ్ ఓపెనింగ్ వీకెండ్‌లోనే రూ. 1000 కోట్ల మైలురాయిని తాకిన మూడో భారతీయ చిత్రంగా 'రామాయణం' నిలిచింది. విదేశాల్లో ఈ సినిమాకు వస్తున్న అపూర్వ ఆదరణ, దేశీయంగా సెలవు దినాలు కలిసిరావడం ఈ భారీ వసూళ్లకు ప్రధాన కారణమయ్యాయి.

'రామాయణం' వెయ్యి కోట్ల ప్రయాణం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. రోజువారీ వసూళ్ల గణాంకాలను పరిశీలిస్తే..

తొలి రోజు (నవంబర్ 5): దీపావళికి మూడు రోజుల ముందు విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 128 కోట్ల గ్రాస్‌తో డీసెంట్ ఓ...