భారతదేశం, ఏప్రిల్ 2 -- రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, కన్నడ స్టార్ యష్ రావణుడిగా నటిస్తున్న 'రామాయణం' టీజర్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. నితేష్ తివారీ విజువల్ వండర్‌గా మలుస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే గతంలో 'రామాయణం' కథను పదే పదే వెండితెరపైకి తీసుకురావడాన్ని తప్పుబట్టిన సీనియర్ నటి దీపికా చిఖ్లియా.. టీజర్ చూసిన తర్వాత తన అభిప్రాయాన్ని మార్చుకుంది. 1980వ దశకంలో రామానంద్ సాగర్ రూపొందించిన ఐకానిక్ 'రామాయణ్' సీరియల్‌లో సీతమ్మ పాత్రతో ఇంటింటికీ చేరువైన దీపికా.. తాజా టీజర్‌పై సానుకూలంగా స్పందించింది.

ఇండియా టుడేతో మాట్లాడిన దీపికా చిఖ్లియా.. రణ్‌బీర్ కపూర్ రామాయణ టీజర్‌లోని గ్రాండియర్‌ను మెచ్చుకున్నారు. "నేను టీజర్ చూశాను. అది చాలా అద్భుతంగా ఉంది. విజువల్స్ చాలా రిచ్‌గా కనిపిస్తున్నాయి....