భారతదేశం, సెప్టెంబర్ 12 -- Ram Pothineni: టాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని మరోసారి తన మంచి మనసుతో వార్తల్లో నిలిచారు. వెండితెరపై ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్‌లతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న హీరో రామ్. నిజ జీవితంలోనూ తన అభిమాని ఆపదలో ఉన్నాడని తెలిసి వెంటనే స్పందించి రియల్ హీరో అనిపించుకున్నారు.

తీవ్రమైన మరియు అరుదైన జెనెటిక్ డిజార్డర్ తో బాధపడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక అభిమాని చికిత్స కోసం రామ్ పోతినేని ముందుకు వచ్చారు. ఆసుపత్రికి అయ్యే పూర్తి వైద్య ఖర్చులను తానే భరిస్తానని హామీ ఇవ్వడంతో పాటు ఇంటికి నిత్యవసర వస్తువులు పంపించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తూర్పు గోదావరి జిల్లాలోని దుప్పలపూడి గ్రామానికి చెందిన 18 ఏళల్ అమ్మాయి శశికి ఓ అరుదైన జన్యువ్యాధి సోకింది. మతిస్థిమితం కోల్పోయిన ఆమె మంచానికే పరిమితమై...