భారతదేశం, మార్చి 4 -- ఎప్పుడూ వివాదాలతో సావాసం చేసే సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి కాంట్రవర్సీకి తెరతీశాడు. కాంటెంపరరీ ఇష్యూస్ పై తన స్టైల్లో రియాక్ట్ అయ్యే ఆర్జీవీ లేటెస్ట్ గా అమెరికా-ఇరాన్ యుద్ధంపై ట్వీట్ పెట్టాడు. ఈ కాంట్రవర్సీ ట్వీట్ తెగ వైరల్ గా మారింది. మతాల పేరుతో ఆర్జీటీ పెట్టిన పోస్టు సంచలనంగా మారింది.

ప్రస్తుతం ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ పై యుద్ధం చేస్తున్నాయి. మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్నాయి. బదులుగా ఇరాన్ కూడా డ్రోన్లు, మిస్సైల్స్ తో మిడిల్ ఈస్ట్ లోని అమెరికా ఎంబసీలపై దాడులు చేస్తున్నాయి. ప్రపంచమంతా ఈ యుద్ధం గురించి ఆందోళన చెందుతోంది.

అమెరికా-ఇరాన్ యుద్ధంపై తాజాగా ఆర్జీవీ పెట్టిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. ''అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం జీసస్, అల్లా మధ్య ఫైట్ లాంటిదే. ఎవరు గెలిస్తే ఆ మతంలోకి నేను మారతా'' అన...