భారతదేశం, జూలై 27 -- Ram Charan Surgery: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేసే వార్త బయటకు వచ్చింది. బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi) షూటింగ్ సమయంలో చరణ్ కుడిచేతి మణికట్టుకు తీవ్ర గాయమైంది. ఈ దెబ్బ కారణంగా విపరీతమైన నొప్పితో బాధపడుతున్న ఆయనకు తమిళనాడులోని కోయంబత్తూర్ గంగా హాస్పిటల్‌లో అత్యవసరంగా హ్యాండ్ సర్జరీ నిర్వహించారు.

ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా ఫ్యాన్స్ తమ అభిమాన హీరో ఆరోగ్యం గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కోయంబత్తూర్‌లోని ప్రముఖ ఆర్తోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎస్. రాజశేఖరన్ నేతృత్వంలో రామ్ చరణ్ కు ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అమెరికాలోని మియామి నుంచి వచ్చిన స్పెషలిస్...