భారతదేశం, మే 24 -- Ram Charan Apologises To Jasprit Bumrah: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరదాగా మాట్లాడబోయి ఒకే వేదికపై బ్యాక్ టు బ్యాక్ రెండు చిన్న పొరపాట్లు చేశారు. శనివారం (మే 23) భోపాల్ నగరంలో అత్యంత వైభవంగా జరిగిన 'పెద్ది' (PEDDI KI AAWAZ) చిత్ర ఆడియో విడుదల వేడుకలో ఈ ఘటన జరిగింది.

చిత్ర యూనిట్ అంతా పాల్గొన్న ఈ పెద్ది గ్రాండ్ ఈవెంట్‌లో రామ్ చరణ్ నోటి నుంచి వచ్చిన కొన్ని మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. క్రికెట్ వీరుడు జస్‌ప్రీత్ బుమ్రాను ఫుట్‌బాల్ ప్లేయర్ అనడమే కాకుండా, భోపాల్‌ ప్రజలను బిహార్ వాసులుగా రామ్ చరణ్ పిలవడంతో స్టేజ్ మీదున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

'ఉప్పెన' లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు బుచ్చిబాబు సాన ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'పెద్ది'. ఇదొక పక్కా స్పోర్ట్స్ డ్రామా కావ...