భారతదేశం, జూన్ 4 -- Ram Charan Peddi Movie : సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరిది ఒక్కో కథ! హీరో అవ్వాలని ఒక సామాన్యుడి పడే కష్టం అంతా ఇంతా కాదు. అదే సమయంలో ఒక లెజెండరీ నటుడికి వారసుడిగా వచ్చే వ్యక్తి ఎదుర్కొనే మానసిక ఒత్తిడి.. ఊహకు అందనిది. మరీ ముఖ్యంగా, తెలుగు సినీ తెరను దశాబ్దాల పాటు ఏలిన తండ్రి నీడలో పుట్టడం ఒక అదృష్టమైతే.. ప్రతి అడుగులోనూ ఆ తండ్రితో పోల్చి చూసే ప్రపంచం ముందు నిలబడటం ఒక నిరంతర యుద్ధం! మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా అడుగుపెట్టిన రామ్​చరణ్ తేజ సరిగ్గా ఇదే యుద్ధాన్ని ఎదుర్కొన్నారు. అయినప్పటికీ, తన కష్టాన్నే నమ్ముకుని.. 'మెగా' నీడను దాటి, ప్రపంచాన్ని గెలిచారు. నేడు ఆయన ప్రపంచ వేదికపై 'గ్లోబల్ స్టార్'గా మెరుస్తున్నారంటే.. ఆ వెలుగు వెనుక ఎవరికీ కనిపించని ఎన్నో సందేహాలు, కష్టాలు, కఠోర శ్రమ దాగి ఉన్నాయనడంలో సందేహం లేదు.

పెద్ది సి...