భారతదేశం, మార్చి 1 -- గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ 'పెద్ది' (Peddi) షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ ఒకేసారి రెండు అదిరిపోయే అప్‌డేట్స్ ఇచ్చారు. ఈ మూవీ కోసం చరణ్ డబ్బింగ్ చెబుతున్న వీడియో పోస్ట్ చేసి అభిమానులను సర్‌ప్రైజ్ చేశాడు.

ఒకవైపు పెద్ది మూవీ షూటింగ్ జరుగుతుండగానే.. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగవంతం చేశాడు డైరెక్టర్ బుచ్చిబాబు. ఇందులో భాగంగా రామ్ చరణ్ ఇప్పటికే డబ్బింగ్ పనులు ప్రారంభించాడు. ఈ సందర్భంగా డబ్బింగ్ స్టూడియోలో తనకూ, దర్శకుడికి మధ్య జరిగిన సరదా సంభాషణకు సంబంధించిన వీడియోను చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. షూటింగ్ సెట్స్‌లోనే కాకుండా డబ్బింగ...