భారతదేశం, మే 25 -- Ram Charan: తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా 'పెద్ది' సినిమా గురించే ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, సోషల్ మీడియా వేదికలపై ఈ చిత్రం పేరు మారుమోగుతోంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ బెంగళూరులో ఓ భారీ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాపై చేసిన కామెంట్స్ అందరి దృష్టినీ ఆకర్షించాయి. ఆయన మాటలు సినిమా రేంజ్‌ను, అంచనాలను అమాంతం పెంచేశాయి.

"పెద్ది సినిమా రాసిపెట్టుకోండి, కచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ అవుతుంది" అని బెంగళూరు ప్రెస్ మీట్‌లో రామ్ చరణ్ ఎంతో నమ్మకంగా చెప్పారు. పాన్ ఇండియా లెవెల్లో మూవీ రిలీజ్ కానుండటంతో మూవీ టీమ్ దేశం మొత్తం తిరుగుతుంది. ఇప్పటికే ముంబైలో ట్రైలర్ లాంచ్, తర్వాత భోపాల్ లో ఓ భారీ కాన్సర్ట...