భారతదేశం, ఆగస్టు 22 -- Ram Charan: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్ద పండగ వాతావరణం నెలకొంది. తమ అభిమాన నటుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాదిమంది అభిమానులు మెగాస్టార్ ఇంటికి తరలివచ్చారు.

ఇవాళ (ఆగస్టు 22) మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చిరంజీవి కోసం ఆయన ఇంటికి భారీగా అభిమానులు తరలివచ్చారు. వాళ్లకు రామ్ చరణ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఫ్యాన్స్ ను చరణ్ కలిశారు.

ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్వయంగా తన నివాసం బయటకు వచ్చి అభిమానులను పలకరించారు. గేటు వద్ద వేచి ఉన్న జనసందోహాన్ని చూసి ఆయన చేతులు జోడించి అభివాదం చేశారు. రామ్ చరణ్ బయటకు రాగానే అభిమానులు 'మెగాస్టార్', 'జై చరణ్' అంటూ పెద్ద ఎత్తున నినాద...