భారతదేశం, జూన్ 22 -- Ram Charan: మెగాస్టార్ చిరంజీవి- బాబీ కొల్లి కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కుతోంది. అయితే సండే (జూన్ 22) హఠాత్తుగా ఈ మూవీ సెట్స్ లో పెద్ది ప్రత్యక్షమయ్యాడు. ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి చిరంజీవితో కాస్త టైమ్ గడిపేందుకు రామ్ చరణ్ వచ్చేశాడు. తన నాన్నను సర్ ప్రైజ్ చేశాడు. ఈ విషయాన్ని డైరెక్టర్ బాబీ కొల్లి సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

అంతర్జాతీయ పితృ దినోత్సవం (ఫాదర్స్ డే) సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సరికొత్త చిత్రం '#Mega158' షూటింగ్ సెట్స్‌లో ఒక అపురూపమైన దృశ్యం ఆవిష్కృతమైంది. తన తండ్రిపై ఉన్న అమితమైన ప్రేమాభిమానాలను చాటుకుంటూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ షూటింగ్ స్పాట్‌కు నేరుగా వచ్చి చిరంజీవిని సర్‌ప్రైజ్ చేశారు. అక్కడ తన తండ్రితో కలిసి కాసేపు సరదాగా సమయాన్ని గడిపారు.

దర్శకుడు బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్...