భారతదేశం, నవంబర్ 10 -- Ram Charan: మహేష్ రెడ్డి తనయుడు అనీష్ హీరోగా పరిచయం అవుతున్న కొత్త సినిమా 'ఇట్లు అర్జున'. మహేష్ ఉప్పల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి వెంకీ కుడుముల నిర్మాత కాగా, కింగ్ నాగార్జున సమర్పిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల హైదరాబాద్ లో గ్రాండ్ గా మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ గా వచ్చి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలియజేశారు.

ఇట్లు అర్జున ఈవెంట్లో రామ్ చరణ్ మాట్లాడుతున్న సమయంలో ఒక చిన్న తప్పు దొర్లడంతో ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇట్లు అర్జున సినిమాలో హీరో అనీష్ మూగవాడిగా నటిస్తున్నాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. "రంగస్థలం సినిమాలో నేను చేసిన మూగవాడి పాత్ర కంటే, ఈ సినిమాలో అనీష్ చేస్తున్న మూగవాడి క్యారెక్టర్ ఇంకా పెద్ద హిట్ అవ్వాలి" అని మనస్ఫూర్తిగా కోరు...