Rakhi Sawant Non Bailable Warrant: హీరోయిన్ రాఖీ సావంత్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్.. ఆత్మహత్య కేసులో కోర్టు కఠిన నిర్ణయం!
భారతదేశం, అక్టోబర్ 18 -- Rakhi Sawant Non Bailable Warrant Suicide Case: బాలీవుడ్ వివాదాస్పద నటి, సీనియర్ హీరోయిన్ రాఖీ సావంత్‌కు చట్టపరమైన చిక్కులు మరింత తీవ్రమయ్యాయి. పుష్కర కాలం కిందటి నాటి ఆత్మహత్య కేసులో కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడంతో ఆమెపై ఉత్తర ప్రదేశ్ ఝాన్సీ జిల్లా న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
గతంలో రాఖీ సావంత్ హోస్ట్‌గా వ్యవహరించిన ఒక టెలివిజన్ రియాలిటీ షోలో ఆమె తీవ్రంగా అవమానించడం వల్లే ఓ వ్యక్తి ప్రాణాలు తీసుకున్నాడనేది ఈ కేసులోని ప్రధాన ఆరోపణ. ఈ కేసు విచారణలో భాగంగా కోర్టు ఇచ్చిన సమన్లకు రాఖీ సావంత్ పదే పదే గైర్హాజరవుతూ వచ్చారు.
దీనిని తీవ్రంగా పరిగణించిన సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) అంజలి, రాఖీ సావంత్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ విషయాన్ని జిల్లా ప్రభుత్వ న్యాయవాది (క్రిమినల్)...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.