భారతదేశం, నవంబర్ 23 -- Rakesh Bedi: ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజీ 'ధురంధర్', 'ధురంధర్: ది రివెంజ్' సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో కొత్త రికార్డులు సృష్టించాయి. ఈ చిత్రాల్లో 'జమీల్ జమాలి' అనే కీలక పాత్రలో నటించిన సీనియర్ బాలీవుడ్ నటుడు రాకేష్ బేడీ మరోసారి ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్నారు.

అయితే నవంబర్ 21న గోవాలో జరుగుతున్న 57వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (IFFI) వేదికపై 'ధురంధర్' ప్రత్యేక ప్రదర్శన అనంతరం రాకేష్ బేడీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. 1981లో కమల్ హాసన్ హీరోగా వచ్చిన 'ఏక్ దూజే కే లియే' (Ek Duuje Ke Liye) సినిమా విజయం ముందు 'ధురంధర్' సక్సెస్ చిన్నదేనని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇఫీ (IFFI) ఇండియన్ పనోరమా విభాగాన్ని ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ...