Rajinikanth Vacation: ఇండస్ట్రీ హిట్ ఇచ్చి ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్.. రజనీ ఫొటోలు వైరల్
భారతదేశం, నవంబర్ 17 -- Rajinikanth Vacation: కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవలే 'జైలర్ 2' (Jailer 2) మూవీతో తమిళ సినీ చరిత్రలోనే ఆల్-టైమ్ అత్యధిక వసూళ్లు సాధించి, బాక్సాఫీస్ వద్ద రూ. 800 కోట్ల మార్కును దాటి సరికొత్త రికార్డు సృష్టించారు. ఇప్పుడీ విజయాన్ని ఆస్వాదిస్తూ ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. భార్య లత, కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య, అల్లుడు విషాగన్ వనంగముడి, మనవళ్లతో కలిసి రజనీకాంత్ ఎంతో సంతోషంగా చిరునవ్వులు చిందిస్తున్న ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా సినిమా షూటింగ్లతో ఎప్పుడూ బిజీగా ఉండే రజనీకాంత్.. తన కుటుంబానికి సమయం కేటాయించిన ప్రతిసారీ ఆ ఫోటోలు అభిమానులకు కనువిందు చేస్తుంటాయి. తాజాగా సౌందర్య రజనీకాంత్ షేర్ చేసిన ఫోటోలలో రజనీకాంత్ ఎంతో ఉత్సాహంగా, ప్రశాంతంగా కనిపిస్తున్నారు.
...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.