భారతదేశం, సెప్టెంబర్ 29 -- Rajinikanth Ram: రజినీకాంత్ హీరోగా తమిళ దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తున్న 'ధర్మన్' షూటింగ్ ప్రస్తుతం మైసూర్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్ విశేషాలను అభిమానులతో పంచుకునే క్రమంలో రాశి ఖన్నా పొరపాటున లీక్ చేసిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది.

రాశి ఖన్నా షేర్ చేసిన మల్టీ-పిక్ పోస్ట్‌లో ఓ ఫొటోలో రజినీకాంత్, రాశి ఖన్నాలతో పాటు హీరో రామ్ పోతినేని కూడా కనిపించారు. రామ్, రజినీ మధ్యలో రాశీ ఖన్నా ఉంది. ఈ ఫొటో వెంటనే వైరల్ గా మారింది.

ఫ్యాన్స్ వరుసగా స్క్రీన్ షాట్స్ తీసి నెట్టింట షేర్ చేయడంతో రాశి ఖన్నా తక్షణమే ఆ పిక్‌ను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ నుంచి డిలీట్ చేసింది. అయినప్పటికీ, అంతకంటే ముందే స్క్రీన్ గ్రాబ్స్ సోషల్ మీడియాలోకి చేరిపోవడంతో 'ధర్మన్' లో రామ్ పోతినేని యాక్ట్ చేస్తున్నాడ...