భారతదేశం, అక్టోబర్ 27 -- Rajinikanth: అక్టోబర్ 15, 2026న విడుదలైన జైలర్ 2.. కోలీవుడ్ రికార్డులను తిరగరాస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, విడుదలైన 11 రోజుల్లోనే ఇండియాలో రూ.466 కోట్ల (గ్రాస్) కలెక్షన్లు రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో 25.6 మిలియన్ డాలర్లు వసూలు చేయడంతో, ప్రపంచవ్యాప్తంగా దీని కలెక్షన్లు ఏకంగా రూ.710 కోట్లను దాటేశాయి.

కోలీవుడ్ చరిత్రలో 700 కోట్ల మార్కును దాటిన తొలి సినిమాగా జైలర్ 2 సరికొత్త చరిత్ర సృష్టించింది. రజినీకాంత్ గత చిత్రం '2.0' (రూ.691 కోట్లు) నెలకొల్పిన ఎనిమిదేళ్ల పాత రికార్డును ఈ సినిమా బ్రేక్ చేసింది. 75 ఏళ్ల వయసులోనూ బాక్సాఫీస్ దగ్గర రజినీకాంత్ డామినెన్స్ ఏ రేంజ్ లో ఉందనే విషయాన్ని జైలర్ 2 చాటి చెప్పింది.

సాధారణంగా ఒక హీరో కెరీర్‌లో ఒకటి లేదా రెండు ఇండస్ట్రీ హిట్స్ ఉంటేనే గొప్పగా చెప్పుకు...