భారతదేశం, మార్చి 13 -- ప్రముఖ తెలుగు నటుడు రాజేంద్ర ప్రసాద్ ఈ మధ్య స్టేజీ ఎక్కితే చాలు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నాడు. అప్పట్లో అలీ, బ్రహ్మానందంలాంటి వాళ్లపై నోరు పారేసుకున్న అతడు.. ఈ మధ్యే కాంతారావు అవార్డు అందుకుంటూ తమిళ దివంగత నటుడు ఎంజీఆర్ పై నోరు జారాడు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఇప్పుడు క్షమాపణ చెబుతూ తమిళంలో మాట్లాడిన ఓ వీడియోను రిలీజ్ చేశాడు.

రాజేంద్ర ప్రసాద్ ఈ వీడియోలో తమిళ ప్రజలు, నటీనటులకు క్షమాపణ చెప్పాడు. ఎంజీఆర్ పై కావాలని తాను అలా మాట్లాడలేదని, అంత ధైర్యం తాను చేయనని అన్నాడు. కాంతారావు అవార్డు అందుకున్న సమయంలో ఏదో ఫ్లోలో నోరు జారానని, క్షమించాలని చేతులు జోడించి వేడుకున్నాడు. అది కూడా తమిళంలో మాట్లాడటం విశేషం. తాను కూడా తమిళ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లోనే పాఠాలు నేర్చుకున్నట్లు ఈ సందర్భంగా చెప్పాడు.

రీసెంట్ గా హై...