భారతదేశం, మే 13 -- Rajeev Kanakala: టాలీవుడ్ సీనియర్ నటుడు రాజీవ్ కనకాల తాజాగా ఒక వివాదానికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. ఇటీవల వైబ్రెంట్ స్కూల్‌లో జరిగిన ఒక కార్యక్రమానికి తాను హాజరవడంపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు, తల్లిదండ్రుల్లో ఉన్న ఆందోళనను తొలగించేందుకు రాజీవ్ కనకాల స్వయంగా రంగంలోకి దిగారు.

వైబ్రెంట్ స్కూల్‌లో జరిగిన ఒక ఈవెంట్ కు రాజీవ్ కనకాల హాజరయ్యారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆ స్కూలు ఈవెంట్ కు రావడం ఏంటని నవ తెలంగాణ శక్తి అధ్యక్షుడు పవన్ ఆయనను నిలదీశారు. దీనిపై తాజాగా ఓ వీడియో ద్వారా రాజీవ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

"వైబ్రెంట్ స్కూల్ ఈవెంట్ విషయంలో జరుగుతున్న ప్రచారంపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. అక్కడ ఏం జరిగిందనే దానిపై కొన్ని అపో...