భారతదేశం, మార్చి 23 -- ఒకప్పుడు వరుసగా సక్సెస్ లు అందుకున్న హీరో రాజశేఖర్. ఈ సీనియర్ హీరో ఇప్పటికీ లీడ్ రోల్స్ ప్లే చేస్తూ అప్పుడప్పుడూ మూవీస్ చేస్తున్నాడు. మరోవైపు బైకర్ మూవీలో హీరో తండ్రిగా క్యారెక్టర్ రోల్ చేస్తున్నాడు. ఇలా క్యారెక్టర్ రోల్స్ చేయడంపై రాజశేఖర్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. బైకర్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో అతని స్పీచ్ వైరల్ గా మారింది.

శర్వానంద్ హీరోగా వస్తున్న ఇండియాలోనే ఫస్ట్ మోటోక్రాస్ మూవీ 'బైకర్'. ఇందులో హీరో తండ్రి, మెంటార్ గా రాజశేఖర్ నటించాడు. ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో రాజశేఖర్ మాట్లాడుతూ ఈ కథ విన్నప్పుడు తనకు చాలా బాగా నచ్చిందని తెలిపాడు. ముఖ్యంగా శర్వానంద్ వంటి యంగ్ హీరోతో కలిసి నటించడం తనకు గొప్ప అనుభూతిని ఇచ్చిందని పేర్కొన్నాడు.

తాను హీరోగా మాత్రమే కాకుండా, కథలో ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ రోల్స్ చేయడాన...