భారతదేశం, జూన్ 10 -- Rajamouli Sing Geetham: టాలీవుడ్ లో కొత్త ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన లేటెస్ట్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్ 'సింగ్ గీతం'. జూన్ 12న (ఈ శుక్రవారం) వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తోంది. ఈ క్రమంలోనే ఇండియన్ సినిమా గర్వించదగ్గ మాస్టర్ స్టోరీ టెల్లర్ ఎస్ఎస్ రాజమౌళి ఈ మూవీ ప్రమోషన్స్ కోసం స్వయంగా రంగంలోకి దిగారు.

'సింగ్ గీతం' సినిమాకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన టికెట్లలో ఫస్ట్ టికెట్‌ను దర్శకుడు రాజమౌళి కొనుగోలు చేశారు. సాధారణంగా చిన్న చిత్రాలకు లేదా డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ కు ఇండస్ట్రీలోన...