భారతదేశం, నవంబర్ 5 -- Rajamouli Ramayana Review: ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మైథలాజికల్ విజువల్ వండర్ 'రామాయణం' థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో భారతీయ సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా పెంచిన భారతదేశపు అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తాజాగా ఈ సినిమా చూసి సోషల్ మీడియా వేదికగా తన రివ్యూను పంచుకున్నారు. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా జీవించిన తీరును, యశ్ రావణాసురుడిగా చూపించిన గంభీరమైన ప్రెజెన్స్‌ను జక్కన్న ఆకాశానికెత్తేశారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ఎక్స్'లో రాజమౌళి పోస్ట్ చేస్తూ సినిమా విజువల్ స్కేల్‌ను, నటీనటుల పనితీరును అభినందించారు.

"రామాయణ.. సినిమా స్కేల్, బిగ్ స్క్రీన్ విజువల్స్ చూస్తుంటే చాలా అద్బుతంగా ఉన్నాయి. ముఖ్యంగా వనవాసం ఘట్టం నుంచి రణబీర్ కపూర్ శ...