భారతదేశం, ఏప్రిల్ 21 -- Rajamouli: పని రాక్షసుడు, పర్ఫెక్షనిస్ట్, బ్రేక్ ఇవ్వడు.. ఎస్ ఎస్ రాజమౌళి గురించి చెప్పమంటే అతనితో పనిచేసిన హీరోలు చేప్పే ఆన్సర్లు ఇవి. అవును.. రాజమౌళి నిజంగానే పని రాక్షసుడు. తను అనుకున్న విధంగా సినిమాను తెరకెక్కించడంలో పర్ఫెక్షనిస్ట్. ఒక్క మూవీకి కమిట్ అయితే మాత్రం బ్రేక్ లేకుండా షూటింగ్ ను కొనసాగిస్తాడని రాజమౌళికి పేరు ఉంది. కానీ వారణాసి విషయంలో మాత్రం అతను మారిపోయాడనే కామెంట్లు వస్తున్నాయి.

సాధారణంగా అయితే తన సినిమా షూటింగ్ లకు ఎస్ ఎస్ రాజమౌళి బ్రేక్ ఇవ్వడన్నది ఇండస్ట్రీ వర్గాల మాట. తాను అనుకున్న విధంగా ఔట్ పుట్ వచ్చేంత వరకూ ఎవరినీ వదిలిపెట్టడు. కానీ ఇప్పుడు రాజమౌళి మారిపోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోసారి 'వారణాసి' మూవీ షూటింగ్ కు రాజమౌళి బ్రేక్ ఇవ్వడమే ఇందుకు కారణం.

రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్ల...