భారతదేశం, జూలై 28 -- రాజమండ్రి విమానాశ్రయంలో విమానాల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. 2025-26 సంవత్సరంలో విమాన సర్వీసుల నిర్వహణ సమయంలో కనీసం 31 బర్డ్ హిట్(విమానాలను పక్షులు ఢీకొట్టడం) ఘటనలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఘటనల వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకపోవడం ఊరటనిచ్చే విషయం.

సురక్షిత విమాన సర్వీసుల నిర్వహణపై ఇటీవల నిర్వహించిన 'రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ ఎయిర్‌ఫీల్డ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్‌మెంట్ కమిటీ' సమీక్షా సమావేశంలో ఈ వివరాలను అధికారులు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ వై.మేఘ స్వరూప్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ కె. ప్రీత, టెర్మినల్ మేనేజర్ కృష్ణ చైతన్య పాల్గొని పలు కీలక అంశాలను మాట్లాడారు.

విమానాశ్రయం చుట్టుపక్కల ఉన్న మధురపూడి, గుమ్మలూరు, బూరుగుపూడి వంటి ప్రాంతాల్లో అక్రమంగా ఘన వ్యర్థాలను వ...