భారతదేశం, సెప్టెంబర్ 22 -- వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. మరికొన్ని గంటల్లో తీవ్రవాయుగుండంగా మారనుంది. ఇది వేగంగా కదులుతూ విశాఖపట్నం, గోపాల్‌పూర్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్రవ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో రాబోయే 48 గంటల్లో అత్యంత భారీ నుంచి తీవ్ర భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

తీరం వెంట గంటకు 50 నుండి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారింది. దీంతో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది.

మరోవైపు ఉత్తర కోస్తాకు ఫ్లాష్ ఫ్లడ్స్ అలెర్ట్ జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలకు ముప్పు ప...