Rain alert : దక్షిణాదికి భారీ వర్ష సూచన.. ఆ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్!
భారతదేశం, అక్టోబర్ 23 -- బంగాళాఖాతం వాతావరణంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అండమాన్ సముద్రం మీదుగా దూసుకొస్తున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అక్టోబర్ 23 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఈ అల్పపీడనం క్రమంగా వాయవ్య దిశగా పయనిస్తూ మరింత బలపడే అవకాశం ఉండటంతో దక్షిణాది రాష్ట్రాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండనుందని అభిప్రాయపడింది.
ప్రత్యేకించి తమిళనాడు, కేరళ ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ రాబోయే రోజుల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన ఈదురు గాలుల వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయని ఐఎండీ వెల్లడించింది.
వాతావరణ శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో ఏకంగా 115.6 ఎంఎం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.