భారతదేశం, సెప్టెంబర్ 30 -- ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి సమీపంలోని రేణిగుంట రైల్వేస్టేషన్ యార్డ్‌లో మౌలిక వసతుల పెంపు, ఇంటర్ లాకింగ్ పనుల దృష్ట్యా దక్షిణ కోస్తా రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. నవంబరు 10 నుంచి డిసెంబరు 27 వరకు దాదాపు 48 రోజుల పాటు పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్ని రైళ్ల మార్గాలను మళ్లిస్తున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే జోనల్ అధికారి విజయ్‌కిషన్ ఒక ప్రకటనలో వెల్లడించారు.

రైలు మార్గాల ఆధునీకరణ పనుల కారణంగా నిత్యం ప్రయాణించే ప్రయాణికులు, ఉద్యోగులపై ప్రభావం పడే అవకాశం ఉంది. ప్యాసింజర్ రైళ్లు 48 రోజుల పాటు పూర్తిగా రద్దు చేశారు. కడప - అరక్కోణం, తిరుచానూరు - అరక్కోణం, చెన్నై - తిరుచానూరు, గూడూరు - రేణిగుంట, నెల్లూరు - రేణిగుంట మార్గాల్లో నిత్యం రాకపోకలు సాగించే రోజువారీ ప్యాసింజర్ రైళ్లను పూర్తిగా రద్దు చేశారు.

సప్తగిరి ఎక్...