భారతదేశం, మార్చి 4 -- బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమాలోని 'రై రై రారా' పాట యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఒక ఎత్తయితే, అనంత శ్రీరామ్ రాసిన స్ఫూర్తిదాయకమైన సాహిత్యం మరో ఎత్తు. ఈ పాట సాధిస్తున్న విజయంపై అనంత శ్రీరామ్ మీడియాతో ముచ్చటించారు. అసలు ఈ పాట అర్థమేంటి? ఎందుకు తనకు ఆరు నెలల సమయం పట్టిందన్నది అతడు వివరించాడు.

పెద్ది మూవీలోని రై రై రా రా పాటలోని హుక్ లైన్ గురించి అనంత శ్రీరామ్ చెబుతూ.. "ఈ సినిమాలో హీరో ఒక లీడర్‌లా కనిపిస్తారు. పల్లెటూళ్లలో ప్రజలు ఎక్కువగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. బస్సు కండక్టర్ 'రై రై' అనగానే డ్రైవర్ బస్సును ముందుకు పోనిస్తాడు. అంటే.. జీవితంలో కూడా ఎక్కడా ఆగకుండా నిరంతరం ముందుకు సాగిపోవాలి అనే అర్థం వచ్చేలా ఈ పదాన్ని వాడా...