Raghava Lawrence: వీధి కుక్క కూడా కరుస్తుంది.. విజయ్ టీవీకే పాలనపై రాఘవ లారెన్స్ కామెంట్స్.. వివాదం రేగడంతో వివరణ
భారతదేశం, జూన్ 15 -- Raghava Lawrence: ఇటీవలే పాలిటిక్స్ లోకి వస్తున్నట్లు ఒక వీడియో ద్వారా ప్రకటించిన రాఘవ లారెన్స్.. ఆదివారం (జూన్ 14) రాఘవేంద్ర స్వామి ఆలయం దగ్గర మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తమిళనాడులో కొత్తగా బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని 'టీవీకే' (TVK) ప్రభుత్వం పనితీరుపై జర్నలిస్టులు ఆయనను ప్రశ్నించారు. దానికి లారెన్స్ స్పందిస్తూ.. కొత్త ప్రభుత్వానికి కాస్త సమయం ఇవ్వాలని కోరారు. ఆ విషయాన్ని వివరించడానికి ఆయన చెప్పిన ఒక ఉదాహరణే ఈ పెద్ద రచ్చకు కారణమైంది.
ప్రభుత్వ పరిపాలనను వివరిస్తూ లారెన్స్.. "మనం ఒక కొత్త ఇల్లు కొనే ముందు ఒకటో రెండో సార్లు చూసి లోపలికి వెళ్తాం. కానీ ఆ ఇంట్లో కాపురం పెట్టాకే ఎక్కడ పైపులు లీక్ అవుతున్నాయి, ఏ ఫ్యాన్ తిరగడం లేదు వంటి లోపాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. పరిపాలన కూడా అంతే" అని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.