భారతదేశం, అక్టోబర్ 22 -- Rag Mayur 5 Roles In Garividi Lakshmi: తెలుగు చిత్రసీమలో ప్రస్తుతం కంటెంట్ ఆధారిత సినిమాలకు, వైవిధ్యమైన పాత్రలను ఎంచుకునే యువ నటులకు మంచి ఆదరణ లభిస్తోంది. చిన్న సినిమాలతో ప్రయాణం ప్రారంభించి, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు వెండితెరపై తనదైన శైలిలో దూసుకుపోతున్నారు నటుడు రాగ్ మయూర్.

'సినిమా బండి' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన ఆయన, నాటకరంగంలో గడించిన అనుభవంతో ప్రతి పాత్రలోనూ వైవిధ్యాన్ని చూపిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

దర్శకుడు గౌరి నాయుడు జమ్ము తెరకెక్కించిన 'గరివిడి లక్ష్మి' చిత్రంలో రాగ్ మయూర్ 'సత్తిబాబు' అనే బుర్రకథ కళాకారుడి పాత్ర పోషించారు. హీరోయిన్ ఆనంది ప్రధాన పాత్ర పోషించిన ఈ ఒక్క సినిమాలోనే ఐదు విభిన్న కోణాలు ఉన్న పాత్రను ఆవిష్కరించడం నటుడిగా ఆయన ప్రతిభకు అసలైన పరీక్షగా నిలిచింది....