భారతదేశం, మే 17 -- Rag Mayur About His Filmography: ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న ప్రతిభావంతులైన నటుల్లో రాగ్ మ‌యూర్‌ ఒకరు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రాగ్ మయూర్.. తన 2021 బ్లాక్‌బస్టర్ చిత్రం 'సినిమా బండి' ఈ శుక్రవారం (మే 15)తో ఐదేళ్లు పూర్తి చేసుకుంటుండటంపై ఆనందం వ్యక్తం చేశారు.

ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు ప్రవీణ్ కండ్రేగులకు, నిర్మాతలు రాజ్ నిడిమోరు, కృష్ణ డి.కెల‌కు రాగ్ మయూర్ కృతజ్ఞతలు తెలిపారు. "న‌టుడిగా నేను కెరీర్ ప్రారంభించిన తొలి సినిమాకే మ‌రిడేశ్‌ బాబు లాంటి అద్భుతమైన పాత్ర రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అంతకంటే మంచి డెబ్యూని నేను కోరుకోలేను. సినిమా బండి సినిమా న‌టుడిగా నాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది" అని రాగ్ మ‌యూర్ తెలిపారు.

ఈ సినిమా విజయం తన కెరీర్‌లో కొ...