భారతదేశం, నవంబర్ 3 -- Radhika Apte Legend: బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీలలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి రాధికా ఆప్టే ఎప్పుడూ బోల్డ్ వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటుంది. ఇటీవల తన కొత్త వెబ్ సిరీస్ 'అక్క' (Akka) ప్రమోషన్స్ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్, జూమ్ (Zoom) ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన కెరీర్‌లోనే అత్యంత కష్టమైన, అసంతృప్తిని కలిగించిన పాత్ర గురించి సంచలన నిజాలను బయటపెట్టింది.

సహ నటి కీర్తి సురేష్‌తో కలిసి పాల్గొన్న ఈ ఇంటర్వ్యూలో "మీ కెరీర్‌లో మీకు బాగా సవాలుగా అనిపించిన పాత్ర ఏది?" అని అడగ్గా, రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్ చేసింది.

"నేను ఒక తెలుగు సినిమా చేశాను. అందులో నా కంటే వయసులో చాలా పెద్దవారైన నటుడితో రొమాన్స్ చేయాల్సి వచ్చింది. అంతేకాకుండా అందులో మావయ్యను పెళ్లి చేసుకునే సన్నివేశం ఉంటుంది. నిజానికి ఆ సినిమాలో ప్రతి...