భారతదేశం, అక్టోబర్ 28 -- Radhika Apte: భారతీయ చిత్ర పరిశ్రమలో విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ తనదైన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రాధికా ఆప్టే. సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన 'కబాలి', నందమూరి బాలకృష్ణ సరసన 'లయన్', అలాగే 'వెట్రి సెల్వన్' వంటి పలు దక్షిణాది చిత్రాలలో నటించి సౌత్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అయితే 2019లో వచ్చిన 'చిత్తిరం పేసుతాడి 2' చిత్రం తర్వాత ఆమె ఏ దక్షిణాది సినిమాలోనూ కనిపించలేదు.

గత కొన్నేళ్లుగా సౌత్ చిత్ర పరిశ్రమకు ఎందుకు దూరంగా ఉంటున్నారనే విషయంపై రీసెంట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాధికా ఆప్టే సంచలన విషయాలను బయటపెట్టారు. కీర్తి సురేష్‌తో కలిసి నటించిన తన లేటెస్ట్ నెట్‌ఫ్లిక్స్ గ్యాంగ్‌స్టర్ వెబ్ సిరీస్ 'అక్క' (Akka) ప్రమోషన్ల సందర్భంగా ఆమె ఈ విషయాలను పంచుకున్నారు.

తాజాగా 'న్యూస్18' కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రా...