భారతదేశం, జూన్ 29 -- Rachana Banerjee Fires On Kalyan Banerjee: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ చిత్రం 'బావగారు బాగున్నారా' సినిమా గుర్తుందిగా? అందులో సెకండ్ హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి రచనా బెనర్జీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనంగా మారారు.

టీవీ9 బంగ్లాకు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో రచనా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ (TMC) సీనియర్ ఎంపీ కల్యాణ్ బెనర్జీని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజాప్రతినిధి అనే విషయాన్ని మరిచి ఆయన మాట్లాడే తీరు, వాడే పదజాలం కోల్‌కతాలోని రెడ్ లైట్ ఏరియా (యౌనపల్లి) సంభాషణల కంటే ఘోరంగా ఉన్నాయంటూ మండిపడ్డారు. కేవలం ఆయన భాషనే కాకుండా, ఆయన రాజకీయ వైఫల్యాలను కూడా బహిరంగంగా ఎండగట్టారు.

శ్రీరాంపూర్ ఎంపీ అయిన కల్యాణ్ బెనర్జీ.. హుగ్లీ లోక్‌సభ నియోజకవర్గ వ్యవహారాల్లో పదే పదే...