భారతదేశం, జూలై 23 -- Raakaasa TV Premiere: బుల్లితెర ప్రేక్షకులను భయపెట్టేందుకు రీసెంట్ తెలుగు హారర్ థ్రిల్లర్ 'రాకాస' (Raakaasa) గ్రాండ్‌గా రెడీ అయింది. థియేటర్లలో హారర్ లవర్స్‌ను ఎంతగానో అలరించిన ఈ మూవీ.. ఈ ఆదివారం అంటే జులై 26న సాయంత్రం 6 గంటలకు ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ జీ తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ కాబోతోంది.

హోమ్ ఆడియన్స్‌కు నిరంతరం సూపర్ హిట్ సినిమాలు అందించే క్రమంలో జీ తెలుగు ఈ వీకెండ్ స్పెషల్ సర్ ప్రైజ్ ప్లాన్ చేసింది. ప్రతిక్షణం సస్పెన్స్, వెన్నులో వణుకు పుట్టించే సీన్లతో ఈ సినిమా బుల్లితెరపై గ్రాండ్ రీచ్ సాధిస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు.

ఈ రాకాస మూవీలో ఒక యంగ్ కపుల్ జీవితంలోకి ఊహించని విధంగా ఒక భయానకమైన సూపర్‌నేచురల్ పవర్ ఎంట్రీ ఇవ్వడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ పురాతన శాపం వెనుక ఉన్న డార్క్ సీక్ర...