భారతదేశం, మార్చి 8 -- టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మెగా డాటర్ నిహరిక కొణిదెల ఇప్పుడు నిర్మాతగా మారి కాన్సెప్ట్ సినిమాలను రూపొందిస్తోంది. ఇదివరకు కమిటీ కుర్రోళ్లు సినిమాతో నిర్మాతగా మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమాతో అవార్డులు కూడా అందుకున్నారు.

కమిటీ కుర్రోళ్లు సినిమా తర్వాత నిహారిక కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుంచి వస్తున్న మరో తెలుగు సినిమా రాకాస. జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో నిర్మాత ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి ఈ 'రాకాస' మూవీని నిర్మించారు నిహారిక కొణిదెల.

ఓటీటీ సిరీస్‌తో డైరెక్టర్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న మానస శర్మ రాకాస సినిమాకు దర్శకత్వం వహించారు. ఫాంటసీ హారర్ కామెడీగా తెరకెక్కిన రాకాస సినిమాలో సంగీత్ శోభ‌న్‌ హీరోగా న‌య‌న్ సారిక‌ హీరోయిన్‌గా నటించారు. రాకాసా సినిమా ఏప్రిల్ 3న థియేట్రికల్ రిలీజ్ ...