భారతదేశం, జూలై 29 -- Raaka Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ (Atlee) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ 'రాకా' (Raaka) మూవీకి సంబంధించి ఒక్కసారిగా ఇండస్ట్రీ మైండ్ బ్లాంక్ అయ్యే అప్‌డేట్ బయటకు వచ్చింది. ఏకంగా రూ. 1,000 కోట్ల మైండ్ బ్లాకింగ్ బడ్జెత్‌తో రూపొందుతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ పక్కా ప్లాన్ సిద్ధం చేసినట్లు ఇండియా టుడే ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్ వెల్లడించింది.

టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత భారీ లెవెల్‌లో రూపొందుతున్న ఈ పీరియాడిక్ విజువల్ వండర్ ఇండియన్ సినిమా రేంజ్‌ను అంతర్జాతీయ వేదికపై నిలబెట్టబోతోంది.

'రాకా' కథ రెండు వేర్వేరు ప్రపంచాల్లో, భిన్నమైన కాలమానాల్లో సాగుతుందని టాక్ నడుస్తోంది. ఒక ప్రపంచం ప్రాచీన గిరిజన పౌరాణిక వేద క...